ఐదేళ్ల ప్రేమాయణం.. ఆస్పత్రిలో పెళ్లి! | Lovers Marriage In Hospital Compound | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల ప్రేమాయణం.. ఆస్పత్రిలో పెళ్లి!

Jul 13 2019 3:16 PM | Updated on Jul 13 2019 7:33 PM

Lovers Marriage In Hospital Compound - Sakshi

సాక్షి, సిరిసిల్లా: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు... చివరికి తన తప్పుదిద్దుకున్నాడు. గ్రామస్తులంతా బాధితురాలి పక్కన నిలబడడంతో... ఆస్పత్రిలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. నుదుటిపై బొట్టుపెట్టి జీవినభాగస్వామిని చేసుకున్నాడు. ఈ అరుదైన పెళ్లి... రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. చిన్నబోనాలకు చెందిన ముత్యాల రాజు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దేవలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమాయణం ఐదేళ్లు సాగింది. 

పెళ్లి చేసుకుంటానని చెప్పి... ఆమెను గర్భవతిని కూడా చేశాడు ముత్యాలరాజు. ఆ తర్వాత మొహం చాటేశాడు. యువతి మృతశిశువుకు జన్మనిచ్చి... జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు జరిగిన అన్యాయం తెలుసుకుని గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. మోసం చేసిన ముత్యాలరాజుతో మాట్లాడి.. బాధితురాలిని న్యాయం జరిగేలా చేశారు. ఈ మేరకు గ్రామస్తులు తమ మధ్యవర్తిత్వంతో ఆస్పత్రి ఆవరణలోనే ముత్యాలరాజు-దేవలక్ష్మిల పెళ్లి జరిపించారు. దీంతో వారి కథ సుఖాంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement