కౌలు రైతు ఆత్మహత్య | Lease farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Nov 7 2015 12:42 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల భారం మరో అన్నదాత ప్రాణం తీసింది.

అప్పుల భారం మరో అన్నదాత ప్రాణం తీసింది.  యాలాల మండలం బషీర్ మియా తండాలో శనివారం ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. యాలాల మండలం బషీర్ మియా తండాలో మోహన్(30) రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది కౌలుకు తీసుకున్న పొలంలో కంది, వరి పంటలు వేశాడు. అయితే నీళ్లు సరిపోక పంట ఎండి పోవడంతో.. ఆయన మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement