ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇక నో చాన్స్‌!

Layout Regularisation scheme In Hyderabad - Sakshi

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగిసినట్లే... 

ఇప్పటికే మూడు సార్లు అవకాశం 

మరోసారి పొడిగింపు ఉండక పోవచ్చని సంకేతాలు

దరఖాస్తులను త్వరితంగా క్లియర్‌ చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ పరిధిలో ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు ముగిసినట్లే. ఇకపై గడువు పొడిగింపునకు ఆస్కారం లేదని  తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్‌ చేసే పనిలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికారులు నిమగ్నమయ్యారు. హెచ్‌ఎండీఏకు వచ్చిన 1,75,612 దరఖాస్తుల్లో లక్ష వరకు క్లియర్‌ చేయగా, 75,612 దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరించిన వాటిలో రెవెన్యూ, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్ల నుంచి ఎన్‌ఓసీలు తేవాలన్న 9 వేల దరఖాస్తులను అధికారులు తిరిగి పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయా విభాగ అధికారులతో సమావేశమై ఆ ప్లాట్‌ల క్రమబద్ధీకరణపై స్పష్టత తెచ్చేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18,500 మంది హెచ్‌ఎండీఏకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీరందరూ కడితే దాదాపు రూ.150 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.               

హెచ్‌ఎండీఏ పరిధిలో సరైన డాక్యుమెంట్లు లేని ప్లాట్లు, సరిగా అప్‌లోడ్‌ చేయక షార్ట్‌ఫాల్స్‌ అయినవి, ఇంకా వివిధ కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులను తిరిగి అప్పీల్‌ చేసుకునేందుకు ఇదే చివరిసారి కానుంది. అలాగే లే అవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజు కట్టాలంటూ సమాచారం అందుకున్న దరఖాస్తుదారులు సాధ్యమైనంత తొందరగా ఫీజు చెల్లించుకుంటే మంచింది. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగింపునకు అవకాశం ఇచ్చేది లేదని సంకేతాలు వెలువడుతున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశం మేరకు తమ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్‌ చేసే పనిలో హెచ్‌ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మూడు నెలల్లో మూడు సార్లు ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు పొడిగింపునకు అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా ప్రభుత్వం మళ్లీ అవకాశం ఇస్తుందనుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు చిక్కులు తప్పవు. హెచ్‌ఎండీఏకు వచ్చిన 1,75,612 దరఖాస్తుల్లో లక్ష వరకు క్లియర్‌ చేయగా, 75,612 దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరించిన వాటిలో రెవెన్యూ, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్ల నుంచి ఎన్‌ఓసీలు తేవాలన్న 9 వేల దరఖాస్తులను అధికారులు తిరిగి పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయా విభాగ అధికారులతో సమావేశమై ఆ ప్లాట్‌ల క్రమబద్ధీకరణపై స్పష్టత తెచ్చేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 18,500 మంది హెచ్‌ఎండీఏకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. వీరందరూ కడితే దాదాపు రూ.150 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది.   

పక్కా పారదర్శకంగా.. 
హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2015 నవంబర్‌లో ప్రభుత్వం అవకాశమిచ్చింది. మళ్లీ 2016 డిసెంబర్‌లో 20 శాతం అధిక రుసుంతో మరోసారి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ భూములు, సీలింగ్, శిఖం, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్స్‌ తదితర స్థలాల్లో ఉన్నాయనే కారణాలతో తిరస్కరించిన 75,612 దరఖాస్తుల్లోని మరికొన్నింటిని మళ్లీ టెక్నికల్‌ స్క్రూటిని చేశారు. తిరస్కరించిన వాటిలో ఎక్కువగా మాస్టర్‌ ప్లాన్‌లో రోడ్లు, చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లో ప్లాట్లు ఉన్నాయని, మాస్టర్‌ప్లాన్‌లో సర్వే నంబర్లు లేనివి ఉన్నాయి. 

‘మాస్టర్‌ ప్లాన్‌’ చొరవ.. 
హెచ్‌ఎండీఏలోని మాస్టర్‌ ప్లాన్‌ విభాగంలో లే అవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్లాట్ల కియరెన్స్‌ దాదాపు పూర్తయింది. రెవెన్యూ స్కెచ్‌ లేకుండా ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులకు ఏమాత్రం ఇబ్బందుల్లేకుండా మాస్టర్‌ ప్లాన్‌ విభాగంలోని ప్రత్యేక బృందం ఆయా లే అవుట్ల వద్దకు వెళ్లి జియో కో ఆర్డినెట్స్‌ తెప్పించుకొని ఆయాప్లాట్లు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో పో తున్నాయా, చెరువులు, శిఖలు, కుంటల్లో ఉన్నా యా, బఫర్‌జోన్‌లో ఉన్నాయా, నాలాలో ఉ న్నా యా గుర్తించి లేనివాటికి ఎల్‌ఆర్‌ఎస్‌ సిబ్బంది సహాయంతో క్లియరెన్స్‌ అయ్యేలా చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top