ఓ లేబర్ కాంట్రాక్టర్ మహిళా కూలీపట్ల అమానుషంగా ప్రవర్తించాడు.
మెదక్: ఓ లేబర్ కాంట్రాక్టర్ మహిళా కూలీపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పసిపాపకు పాలివ్వకుండా తల్లిని కాంట్రాక్టర్ అడ్డుకున్నాడు. దాంతో పాప ఏడ్చి ఏడ్చి మృతిచెందినట్టు తెలిసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం వెలుగుచూసింది.
పాప మృతిచెందిన విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ బాధితురాలిని కాంట్రాక్టర్ బెదిరించినట్టు తెలిసింది. మృతిచెందిన పసికందును కాంట్రాక్టర్ గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.