
మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలి
భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. నానక్ రాంగూడలో నిన్న రాత్రి కుప్పకూలిన భవనాన్ని శుక్రవారం షబ్బీర్ అలీతో కలిసి పరిశీలించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నానక్‌రాంగూడ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది.