ఖైదీ నంబర్‌ 3077 : కేటీఆర్‌ 

KTR Who Shared Prison Memories - Sakshi

జైలు జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వరంగల్‌ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ఓ ‘ఖైదీ గుర్తింపు కార్డు’ను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

‘దీక్షా దివస్‌ రోజున కేసీఆర్, ప్రొ. జయశంకర్‌ అరెస్టయ్యారు. ఆ సందర్భంలో నన్ను అరెస్టు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.’అని కేటీఆర్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు. గుర్తింపు కార్డులో ఉన్న వివరాల ప్రకారం.. 2009 నవంబర్‌ 29న హన్మకొండ పోలీసులు 447/2009 కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయగా వరంగల్‌ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రిమాండు విధించారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top