కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు | kolam Community development activities | Sakshi
Sakshi News home page

కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు

Feb 22 2016 2:29 AM | Updated on Sep 3 2017 6:07 PM

కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు

కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు

కొలాం గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.

ఐటీడీఏ పీవో కర్ణన్
అర్జుని కొలాంగూడలో కొలాం గిరిజనుల ప్రత్యేక సమావేశం

  
నార్నూర్ :  కొలాం గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు చేయడం అలవర్చుకుంటే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని అర్జుని కొలాంగూడ గ్రామంలో కొలాం గిరిజన సంఘాల అధ్వర్యంలో కొలాంల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీవో ముఖ్య అతిథిగా హాజరై గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కొలాం గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ చేయడానికి భూమి ఉన్నా ఎండ్లు లేవు. నీళ్లు, క రెంటు మోటారు, ఆరుులింజన్లు లేవు. కొలాం గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు అందడం లేదని కొలాం గిరిజనుడు కన్నా పీవో దృష్టికి తెచ్చారు.

పీవో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలు తీసుకొని చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నారు. చిన్న చిన్న రుణాల కోసం ఐటీడీఏ, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఐకేపీ ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం, జీవన్‌జ్యోతి బీమా యోజన పథకం కింద కొలాం గిరిజనులకు ఐటీడీఏ ద్వారా బీమా చేయడం జరిగిందని తెలిపారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం 1000 రైల్వే పోలీసు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిందని, గ్రామంలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఈ నెల మార్చి 3వరకు స్థానిక ఐకేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రూపావంతిజ్ఞానోబాపుస్కర్, ఎంపీపీ రాథోడ్ గోవింద్‌నాయక్, కొలాం అభివృద్ధి అధికారి భాస్కర్, సర్పంచ్ జంగుబాయి కన్నా, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, మాజీ ఎంపీటీసీ భీంరావ్, గ్రామ పటేల్ జంగు, తహశీల్దార్ దేవానందం, ఎంపీడీవో సుధాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, పశువైద్యాధికారి రామకృష్ణ, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement