ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు వచ్చే ఏడాది నుంచి తగ్గనుంది.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు వచ్చే ఏడాది నుంచి తగ్గనుంది. ఒక్కో అడుగు పెరుగుతూ భిన్నమైన ఆకృతిలో కరువిందు చేసిన ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఎత్తు ఈ ఏడాదికి 60 అడుగులకు చేరింది.
ఇంత ఎత్తైన రూపం ఇదే చివరిసారికానుంది. వచ్చే ఏడాది నుంచి గణపయ్య చిత్తరువు ఎత్తు తగ్గనుంది. ఒక్కో అడుగు తగ్గుతూ అవరోహణ క్రమంలో లంబోదరుడి విగ్రహం రూపుదిద్దుకోనుంది.
కాగా, ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతిగా నామకరణం చేశారు.1954లో ఖైరతాబాద్‌లో గణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి. అత్యంత ఎత్తులో అవతరించిన మహా గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు అమితాసక్తి కనబరుస్తున్నారు.
‘విశ్వరూపుడి’ ఈ ఏడాది విశేషాలు..
* మహాగణపతి బరువు 40 టన్నులు
* ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 40 టన్నులు
* గోనె సంచులు 10 వేల మీటర్లు
* బంకమట్టి ఒకటిన్నర టన్నులు
* నార రెండున్నర టన్నులు
* చాక్ పౌడర్ 100 బ్యాగులు
* సిబ్బంది 150 మంది