
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. మంత్రి అధికార నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ వివాహ వేడుకలో వధూవరులు మయాంక్, అంకితలను సీఎం ఆశీర్వదించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, బి.వినోద్‌కుమార్, సంతోష్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను హర్షవర్ధన్ ఆలింగనం చేసుకుంటూ సాదరంగా ఆహ్వానించారు.
వేడుకకు హాజరైన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వధూవరులను ఆశీర్వదిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించారు. వేడుకకు హాజరైన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తదితరులతో కేసీఆర్ ముచ్చటించారు. సాయంత్రం ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్ తిరిగి రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.