రామానాయుడికి కేసీఆర్ నివాళి | KCR Pays tribute to ramanaidu | Sakshi
Sakshi News home page

రామానాయుడికి కేసీఆర్ నివాళి

Feb 19 2015 11:26 AM | Updated on Sep 2 2017 9:35 PM

రామానాయుడికి కేసీఆర్ నివాళి

రామానాయుడికి కేసీఆర్ నివాళి

ప్రముఖ నిర్మాత, దాదాభాయ్ అవార్డు గ్రహీత రామానాయుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.

హైదరాబాద్ :  ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు గురువారం అర్పించారు. రామానాయుడు స్టూడియోలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శంచిన కేసీఆర్ అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబును కేసీఆర్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. 

 

కుటుంబసభ్యులందర్ని ఆయన పలకరించారు.  కేసీఆర్తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా రామానాయుడికి అంజలి ఘటించారు. మరోవైపు రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement