కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ | KCR To Invites YS Jagan As Chief Guest on Kaleshwaram Project Inauguration | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌

Jun 12 2019 2:02 PM | Updated on Jun 12 2019 2:03 PM

KCR To Invites YS Jagan As Chief Guest on Kaleshwaram Project Inauguration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ సర్కార్‌ ముఖ్యఅతిథిగా ఆహ్వానించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ వెళ్లి స్వయంగా వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించనున్నారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని పలు పంపుహౌస్‌లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలు, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని  ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: 150 టీఎంసీలు ఎత్తిపోయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement