దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం | KCR Is Crucial In National Politics | Sakshi
Sakshi News home page

దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం

Mar 17 2019 3:03 PM | Updated on Mar 17 2019 3:05 PM

KCR Is Crucial In National Politics - Sakshi

సాక్షి, మల్యాల:  రైతులు, కార్మికులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్‌ విఫలమయ్యాయని, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకం కానున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. మండలకేంద్రంలో గ్రామ సర్పంచ్‌ మిట్టపల్లి సుదర్శన్‌ స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీపీ తైదల శ్రీలత, జనగం శ్రీనివాస్, నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, బల్మూరి రామ్మోహన్‌రావు, తాటిపాముల రాజేందర్, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు బద్దం తిరుపతిరెడ్డి, కట్కూరి తిరుపతి, ఉప సర్పంచ్‌ డి.కరుణాకర్, ఎంపీటీసీ ఏనుగు రాజిరెడ్డి, దూస వెంకన్న, పోచంపల్లి రాయమల్లు, వంశీధర్, మోత్కు కొమురయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ అడువాల సురేశ్, శివ, రియాజొద్దీన్‌ పాల్గొన్నారు.


రామడుగులో...
ప్రతి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, కార్యకర్త కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ భారీ మెజార్టీతో గెలిచేందుకు కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరారు. వెదిర గ్రామానికి చెందిన వ్యాపారి దొడ్డ లచ్చిరెడ్డితోపాటు ఉప సర్పంచ్‌ ఎడెల్లి సత్యనారాయణరెడ్డి, వార్డు సభ్యుడు బొల్లి రమేశ్, కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు తొరికొండ నారాయణ, పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, రామడుగు, కొక్కెరకుంట సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్‌రావు, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, వెదిర గ్రామ వీడీసీ చైర్మన్‌ నాగుల రాజశేఖర్‌గౌడ్, డైరెక్టర్‌ ఏరెడ్డి కొంరారెడ్డి, నాయకులు లేఖ రాజు, ప్రసాద్, అంజన్‌కుమార్, రాల్లబండి శ్రీనివాస్‌రెడ్డి, నరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పుర్మాణి శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement