మానసిక వికలాంగుడిపై కన్నతల్లి కర్కశం | Karkasam than the mother of a mentally challenged person | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగుడిపై కన్నతల్లి కర్కశం

May 4 2015 12:58 AM | Updated on Oct 16 2018 4:50 PM

భర్తపై కోపంతో మానసిక వికలాంగుడైన కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిందో కన్నతల్లి. ఈ ఘటన ఆదివారం

కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం     చికిత్స పొందుతూ యువకుడి మృతి

పెద్దశంకరంపేట: భర్తపై కోపంతో మానసిక వికలాంగుడైన కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిందో కన్నతల్లి. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట మండలం జూకల్‌కి చెందిన బూర్ల సంగయ్య, సత్యమ్మ దంపతులకు మానసిక వికలాంగుడైన కుమారుడు బూర్ల యేసు (21), ఓ కుమార్తె ఉన్నారు.

ఇటీవల సంగయ్య ఆరు కుంటల భూమిని కొనుగోలు చేశాడు. డబ్బు సరిపోకపోవడంతో భార్య వద్ద ఉన్న బంగారు ఇవ్వాలని కోరాడు. ఇదే విషయమై శనివారం రాత్రి  ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్త మీద కోపంతో యేసుపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు ఆదివారం మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement