
పీజీ అడ్మిషన్ కోసం జూపల్లి దరఖాస్తు
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పీజీ చదవాలని నిర్ణయం తీసుకున్నారు.
కొల్లాపూర్: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పీజీ చదవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన కొల్లాపూర్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన పీజీ కళాశాలలో ఎంఏ (ఇంగ్లిష్) కోర్సులో చేరేందుకు మంగళవారం దరఖాస్తు చేశారు. ఫారాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు కొల్లాపూర్‌లో పీజీ కళాశాలను ఏర్పాటు చేయిస్తే అందులో ఆశించినంతగా విద్యార్థులు చేరడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. పీజీ విద్యార్థులు కాలేజీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చేందుకు తాను పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.