‘కేసీఆర్‌ కావాలనే ఇలా చేస్తున్నారు’ | Jeevan Reddy demands cm kcr to appologise to singareni employees | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ కావాలనే ఇలా చేస్తున్నారు’

Mar 18 2017 5:59 PM | Updated on Mar 18 2019 8:57 PM

‘కేసీఆర్‌ కావాలనే ఇలా చేస్తున్నారు’ - Sakshi

‘కేసీఆర్‌ కావాలనే ఇలా చేస్తున్నారు’

సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌: సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అధికారం చేప్పట్టిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా సింగరేణి ఎన్నికలు వచ్చే వరకు జాప్యం చేశారని ఆరోపించారు. 2014 లోనే వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తే ఇలాంటి సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రెండేళ్లు జాప్యం చేయడం వల్లే ఈ సమస్య తెరపైకి వచ్చిందని చెప్పారు.

అన్‌ఫిట్‌ అయిన కార్మికుల కుటుంబానికి ఉద్యోగం ఇస్తానంటే ఎవరు అడ్డుకోరన్నారు. వ్యూహాత్మకంగానే సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఇలా చేశారని.. అందులో భాగంగానే హైకోర్టులో సమాధానం ఇవ్వడం లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. సుప్రీంకోర్టులో నైనా కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కేసీఆర్ కు ఆయన సూచించారు. లేదంటే సింగరేణి కార్మికులకు సీఎం క్షమాపణ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement