
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని హైదరాబాద్ జిల్లా పరీక్షల కమిటీ స్పషం చేసింది. పరీక్ష కేంద్రంలోకి 8.30 నుంచి అనుమతిస్తామని, 9 గంటల తర్వాత నిమిషం ఆల్యమైనా అనుమతి ఇవ్వబోమని వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి సుమారు 1,65, 695 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం సుమారు 196 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల నిర్వహణకు సుమారు 69 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 200 మంది ఇన్విజిలేటర్లను వినియోగించనున్నారు.
గురువారం జిల్లా రెవెన్యూ అధికారి సరళా వందనం తన చాంబర్‌లో పరీక్షల ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 28 నుంచి జరగనున్న పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష హాల్‌లోకి క్యాలికిలేటర్లు, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని సూచించారు. ఏవేనా సందేహాలున్నవారు డిస్ట్రిక్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్లు హరింద్రనాథ్ 99893 56245, డి భద్రేషన్‌లను 93910 12604, డీఐఈవో 98487 81805లలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ పరీక్షల అధికారి, కన్వీనర్ జయప్రదబాయి, ఏసీపీ భిక్షం రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.