జాతీయ.. ప్రాంతీయ పార్టీల గుర్తులు | Indian Election Party Symbols | Sakshi
Sakshi News home page

జాతీయ.. ప్రాంతీయ పార్టీల గుర్తులు

Nov 16 2018 9:04 AM | Updated on Nov 16 2018 9:04 AM

Indian Election Party Symbols - Sakshi

సాక్షి, ఆలేరు :  జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు మంజూరు చేస్తుంది. అదే విధంగా వివిధ పా ర్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో ఓట్లలో నాలుగు శాతం సంపాదించ గలిగితే దానిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ రాష్ట్రం, లేదా ఒక ప్రాంతంలో నాలుగుశాతం ఓట్లు సాధిస్తే దాన్ని  ప్రాంతీయ పార్టీగా చెబుతారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను కూడా ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యాగానీ.. వ్యక్తుల  వల్లగానీ పార్టీ చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. 
జాతీయ పార్టీలు.. 
దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇతర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించదు. దేశంలోని జాతీయ పార్టీలు.. ఆల్‌ ఇండియా  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎం), ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ , నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ. 
రిజిస్టర్డ్, అన్‌ రికగ్నైజ్డ్‌ పార్టీలు 
ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్‌ అన్‌ రికగ్నైజ్‌డ్‌ పార్టీలు కూడా పోటీల్లో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు, సంస్థలు పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేస్తుంటాయి. ఎన్నికల్లో  పోటీ చేసినా.. చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒక వేళ పోటీ చేసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచే వాటి నుంచి గుర్తులు కేటాయిస్తుంది. అయితే వారికి ఇండిపెండెంట్‌ అభ్యర్థులకన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 1983 రిజిస్టర్డ్, ఆన్‌ రికగ్నైజ్‌డ్‌ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో 73 వరకు ఉన్నాయి. అదే విధంగా 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచుతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement