breaking news
unrecognised parties
-
ఈసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీలకు ఝలక్
ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశ ఎన్నికల వ్యవస్థ క్రమబద్దీకరణలో భాగంగా గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీలను రిజిస్టర్ పొలిటికల్ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను ఈసీ తొలగించింది. రాజకీయ పార్టీలకు వర్తించే ప్రయోజనాలేవీ వర్తించని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఐదు పార్టీలు, తెలంగాణలో 13 పార్టీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది.కాగా, నిబంధనల ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఈసీ షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.Cleaning up the Electoral System: ECI Delists 334 RUPPsRead in detail: https://t.co/qlam3VRcBX pic.twitter.com/hbZDF2fnDZ— Election Commission of India (@ECISVEEP) August 9, 2025పేరుకు మాత్రమే పార్టీలు పెట్టినప్పటికీ.. వీటికి ఎలాంటి కార్యాలయాలు లేవంటూ ఈసీ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అవ్వగా.. తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 2,520కి తగ్గిపోయింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతుండగా.. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పారదర్శకత పెంచడం.. అవినీతి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం.. దీనిలో భాగంగా నిబంధనలు పాటించని పార్టీలను తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. -
జాతీయ.. ప్రాంతీయ పార్టీల గుర్తులు
సాక్షి, ఆలేరు : జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు మంజూరు చేస్తుంది. అదే విధంగా వివిధ పా ర్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో ఓట్లలో నాలుగు శాతం సంపాదించ గలిగితే దానిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ రాష్ట్రం, లేదా ఒక ప్రాంతంలో నాలుగుశాతం ఓట్లు సాధిస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా చెబుతారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను కూడా ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యాగానీ.. వ్యక్తుల వల్లగానీ పార్టీ చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. జాతీయ పార్టీలు.. దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇతర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించదు. దేశంలోని జాతీయ పార్టీలు.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. రిజిస్టర్డ్, అన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీలు కూడా పోటీల్లో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు, సంస్థలు పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేస్తుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా.. చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒక వేళ పోటీ చేసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచే వాటి నుంచి గుర్తులు కేటాయిస్తుంది. అయితే వారికి ఇండిపెండెంట్ అభ్యర్థులకన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 1983 రిజిస్టర్డ్, ఆన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో 73 వరకు ఉన్నాయి. అదే విధంగా 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచుతారు. -
కాదేదీ గుర్తులకనర్హం!
న్యూఢిల్లీ: బెంచీలు, బెలూన్లు, బేబీ వాకర్లు, బెల్టులు.. వీటన్నింటికీ ఉన్న సంబంధం ఏంటో తెలుసా? తమ వద్ద నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీల కోసం ఎన్నికల సంఘం విడుదల చేసిన 164 గుర్తుల్లో ఇవి ఉన్నాయి. ఎన్నికల గుర్తుల ఉత్తర్వులు (రిజర్వేషన్, కేటాయింపులు)–1968 ప్రకారం ఈ గుర్తులను ఏదో ఒక పార్టీకి రిజర్వ్ చేయవచ్చు. ఈసీ జనవరి 11న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇంకా అల్మారా, బ్లాక్ బోర్డు, గ్యాస్ పొయ్యి, సిలిండర్, గ్రామ్‌ఫోన్, ద్రాక్ష, టై, నెయిల్ కట్టర్, అగ్గిపెట్టె, నూడిల్ బౌల్, ప్రెషర్ కుక్కర్, రోడ్ రోలర్ వంటి గుర్తులున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 1,837 నమోదై గుర్తింపు పొందని పార్టీలున్నట్లు ఈసీ తెలిపింది.