రేషన్ బియ్యం పట్టివేత | illegally moving ration rice caught by police | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం పట్టివేత

May 18 2015 1:29 AM | Updated on Aug 21 2018 5:46 PM

అక్రమంగా అటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

తూప్రాన్ : అక్రమంగా అటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆదివారం మండలంలోని పోతరాజుపల్లి చౌరస్తా వద్ద వేలురు గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి అక్రమంగా ఎనిమిది క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నాడు. సదరు వ్యాపారి ఆటోలో బియ్యం తరలిస్తుండగా పోతరాజుపల్లి కమాన్ వద్ద పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వీటి ధర సుమారు రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. దీంతో బియ్యం తహశీల్దార్ కార్యాలయంలో వేసి ఆటోను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపట్టి రేషన్ బియ్యం విక్రయించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement