కరోనా టెస్టుల్లో అక్రమ దందా

Illegal Coronavirus Sample Tests In Telangana - Sakshi

పలు జిల్లాల్లో అనుమతిలేని క్లినిక్‌లలోనే కరోనా శాంపిళ్ల సేకరణ

జనగాంలో ఒక జిల్లాస్థాయి వైద్యాధికారి నిర్వాకం

సొంత క్లినిక్‌లో రాత్రివేళ స్వాబ్‌ల సేకరణ

తర్వాత హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌కు తరలింపు

ఒక్కో కరోనా పరీక్షకు రూ. 3,500 వసూలు

శిక్షణ లేకుండా నమూనాల సేకరణతో ఫలితాలు తారుమారయ్యే చాన్స్‌

అతను జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్నాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన సొంత క్లినిక్‌లో రాత్రివేళ కరోనా లక్షణాలున్న వారి నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నాడు. వాటిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. అనుమతి లేకున్నా అక్రమంగా స్వాబ్‌లను సేకరించి పరీక్ష చేయించేందుకు రూ. 3,500 వసూలు చేస్తున్నాడు.

వరంగల్‌లోనూ ఒక ప్రభుత్వ వైద్యుడు ఇదే నిర్వాకానికి తెరలేపాడు. అనేకచోట్ల శాంపిళ్లు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సొంత నర్సింగ్‌ హోంలో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. అక్కడ శాంపిళ్లను సేకరించి ఈయన కూడా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత్యంతరం లేక కొందరు లక్షణాలున్న బాధితులు రూ. 3 వేల నుంచి 4 వేలు ఇచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు అక్రమ దందాకు తెరలేపారు. జనగాం జిల్లాకు చెందిన ఆ వైద్యాధికారి తన క్లినిక్‌కు వచ్చే వారిలో లక్షణాలున్న వారిని రాత్రి వేళ రమ్మని చెప్పి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగే ఆ క్లినిక్‌లో శాంపిళ్లు ఇవ్వడం గమనార్హం. 3 రోజుల్లో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ల్యాబ్‌ నుంచి పాజిటివ్‌ వచ్చిందంటూ అతనికి ఫలితాల రిపోర్టు ఇచ్చా రు. పాజిటివ్‌ వచ్చాక ఆ జిల్లాస్థాయి అధికారే ఆయనకు వైద్యం చేశాడు. ఇలా కొందరు అక్రమంగా శాంపిళ్లు సేకరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

శాంపిళ్లు సేకరించే అధికారం ఎక్కడిది? 
రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్‌లోని కొన్ని ఆసుపత్రులు, లేబోరేటరీల్లో మాత్రమే కరోనా శాంపిళ్లు సేకరించే అవకాశం, పరీక్ష నిర్వహించే వెసులుబాటుంది. కరోనా వైద్యం చేసే చాలా ఆసుపత్రులకు శాంపిళ్లు సేకరించి పరీక్ష చేసే వెసులుబాటు లేదంటే కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతెందుకు రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన పేరు మోసిన ప్రైవేట్‌ లేబరేటరీలు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే సక్రమంగా శాంపిళ్ల సేకరణ, పరీక్షలు జరగడంలేదంటూ ఐసీఎంఆర్‌ గుర్తించడం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేయడం విదితమే. వాటిల్లో 12 లేబరేటరీలకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే. అలాంటిది అడ్రస్‌లేని క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలలో కరోనా లక్షణాలున్న వారినుంచి శాంపిళ్లను సేకరించడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇచ్చిన అనుమతి ప్రకారం ఒక పరీక్షకు రూ. 2,200 మాత్రమే తీసుకోవాలి. కానీ జనగాం క్లినిక్‌లో ఏకంగా రూ. 3,500 తీసుకోవడం గమనార్హం. 

ప్రత్యేక శిక్షణ ఉండాల్సిందే...
కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు గొంతు లేదా ముక్కులో నుంచి స్వాబ్‌ నమూనాలను సేకరిస్తారు. అది సేకరించాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పారామెడికల్‌ సిబ్బంది అవసరం. లేకుంటే పరీక్ష ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలుంటాయని అంటున్నారు. సరైన పరిమాణంలో స్వాబ్‌ సేకరణ జరగకుంటే, ఒక్కోసారి పరీక్ష నిర్వహించడం కూడా సాధ్యంకాదని నిపుణులు అంటున్నారు. జిల్లాల్లో విరివిగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో అనేకమంది బాధితులు ఇలాంటి అక్రమార్కుల వలలో పడుతున్నారు.

జిల్లా ఆసుపత్రుల్లో, కొన్ని అనుమతి ఉన్నచోట్ల మాత్రమే శాంపిళ్లు సేరిస్తుండటం, అక్కడ రద్దీ ఎక్కువ ఉండటంతో కొందరు అక్రమార్కులు తమ ప్రైవేట్‌ క్లినిక్‌లలో అక్రమంగా శాంపిళ్లు సేకరించి పంపిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కరెన్సీగా మార్చుకుంటున్నారు. రూ. 3,500 వసూలు చేసి, ల్యాబ్‌కు సగం ఇచ్చి, తాము సగం తీసుకుంటున్నట్లు సమాచారం. అటువంటి పరీక్షలు రిపోర్టులు ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ కావడంలేదని ఒక వైద్య నిపుణుడు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-08-2020
Aug 08, 2020, 16:26 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు....
08-08-2020
Aug 08, 2020, 15:54 IST
ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు.
08-08-2020
Aug 08, 2020, 15:35 IST
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన‌ చికిత్స తీసుకుంటున్న...
08-08-2020
Aug 08, 2020, 14:18 IST
ఆదిలాబాద్‌టౌన్‌: చనిపోయిన వారికి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ.. ఏ కులం, ఏ మతంలోనైనా వారి సాంప్రదాయం...
08-08-2020
Aug 08, 2020, 13:35 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన...
08-08-2020
Aug 08, 2020, 12:40 IST
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు.
08-08-2020
Aug 08, 2020, 11:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా...
08-08-2020
Aug 08, 2020, 10:19 IST
రాజమహేంద్రరం క్రైం: పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 252 మందికి ఖైదీలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు...
08-08-2020
Aug 08, 2020, 10:02 IST
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌ తింటే...
08-08-2020
Aug 08, 2020, 09:16 IST
కరోనా వైరస్‌ కమ్యూనిటీ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక...
08-08-2020
Aug 08, 2020, 08:55 IST
హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా పలు వైరస్‌లకు సంబంధించిన  వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఇందులో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌...
08-08-2020
Aug 08, 2020, 08:41 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి....
08-08-2020
Aug 08, 2020, 08:39 IST
సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 80 శాతం మందిలోఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కానీ.. పరీక్షల్లో...
08-08-2020
Aug 08, 2020, 07:18 IST
చెన్నేకొత్తపల్లి: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు...
08-08-2020
Aug 08, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి...
08-08-2020
Aug 08, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం...
08-08-2020
Aug 08, 2020, 03:52 IST
సామాజిక ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.
07-08-2020
Aug 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు...
07-08-2020
Aug 07, 2020, 19:31 IST
సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన...
07-08-2020
Aug 07, 2020, 18:02 IST
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top