ఐకేపీ వీవోఏల ప్రదర్శన, ధర్నా | IKP employees dharna on chalo assembly stopped | Sakshi
Sakshi News home page

ఐకేపీ వీవోఏల ప్రదర్శన, ధర్నా

Nov 25 2014 2:42 AM | Updated on Sep 2 2017 5:03 PM

వేతన బకారులు విడుదల చేయాలన్న డిమాండుతో ‘చలో హైదరాబాద్’....

ఖమ్మం మయూరిసెంటర్: వేతన బకారులు విడుదల చేయాలన్న డిమాండుతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తున్న ఐకేపీ గ్రామ దీపికలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఐకేపీ వీవోఏల ఉద్యోగ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా ధర్నా చౌక్‌కు ప్రదర్శకులు చేరుకున్నారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు.

సంఘం జిల్లా నాయకురాలు రేష్మా అధ్యక్షతన జరిగిన ఈ ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వీవోఏలపట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదని అన్నారు. వీరికి ప్రభుత్వం 17 నెలల వేతనాలు ఇవ్వాల్సుందన్నారు. వీటిని వెంటనే విడుదల చేయూలని అడిగేందుకు వెళుతున్న వీరిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం, లాఠీచార్జి జరపడం అప్రజాస్వామికమని అన్నారు. ఇన్ని నెలలపాటు వేతనాలు రాకపోతే గ్రామ దీపికలు ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. వీరికి ఆహార భద్రత కార్డులను రద్దు చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. వీరికి బకారుు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని, లేదా సంబంధిత మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ దీపికలకు ఐదువేల రూపాయల వేతనం ఇస్తామన్న ఎన్నికల హామీని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. గ్రామ దీపికలపట్ల మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. వేతన బకారుులు వెంటనే విడుదల చేయాలని, వేధింపులు మానుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.నరసింహారావు, ఉపాధ్యక్షులు గణపతి, టి.లింగయ్య, నాయకులు నీరజ, అరుణ, ఫణిరాజు, మోహన్‌రావు, బషీర్, టి.వెంకటేశ్వరరావు, నీలాద్రి, పద్మ, రాణి, వసంత, జయ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement