మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలోకి వెళ్లినా అందులోనే తామూ చేరుతామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత తేల్చిచెప్పారు.
కొత్తగూడెం రూరల్ : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలోకి వెళ్లినా అందులోనే తామూ చేరుతామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత తేల్చిచెప్పారు. కొత్తగూడెంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సోమవా రం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తుమ్మలకు అ నుచరులు ఉన్నారని ఆయన ఏ పార్టీలో చేరితే అందులోనే వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తుమ్మల తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన అహర్నిషలు పాటుపడుతున్నారన్నా రు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, కృష్ణమోహన్, మాజీ సర్పంచ్ భద్రు, బాణోతు సకు రామ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ బోయినపల్లి సుధాకర్, బొజ్జ్జానాయక్ తదితరులు పాల్గొన్నారు.