
'ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యవర్తిగా రాలేదు'
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం నగరానికి వచ్చిన పీయూష్ గోయల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో తానేమీ మాట్లాడుదలుచుకోలేదన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్, చంద్రబాబులకు మధ్యవర్తిగా ఇక్కడకు రాలేదన్నారు. విద్యుత్ సంబంధిత అంశాలపై మాత్రమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైనట్లు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నట్లే ఇక్కడకు కూడా వచ్చానని పీయూష్ తెలిపారు.