బీజేపీ మతతత్వ పార్టీ అని చంద్రబాబు నాయుడు అనలేదని ఆపార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : బీజేపీ మతతత్వ పార్టీ అని చంద్రబాబునాయుడు అనలేదని ఆపార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో పూర్తిస్థాయిలో చర్చల జరిగిన తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని ఆయన గురువారమిక్కడ ఓ చానల్ కార్యక్రమంలో తెలిపారు. కాగా ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ దేశాన్ని సంక్షోభంలో నెట్టేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఎవరితో అయినా కలుస్తామన్నారు.
బీజేపీ అగ్ర నాయకత్వాన్ని, మరీ ముఖ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకోవటాడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తిన వెళ్లిన ఆయన
మోడీతో కలిసి బుధవారం రోజంతా ఓ సదస్సు వేదికను పంచుకున్నారు. పనిలో పనిగా నాటి ఎన్‌డీఏ పాలనను, మోడీ హయాంలో గుజరాత్ పాలనను ఆకాశానికెత్తుతూ పొగడ్తలతో ముంచెత్తారు.