మండలం ఇస్నాపూర్‌లో రోడ్డుపై గంజాయిని విక్రయిస్తున్న భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణయ్య బుధవారం విలేకరులకు తెలిపారు.
పటాన్‌చెరు : మండలం ఇస్నాపూర్‌లో రోడ్డుపై గంజాయిని విక్రయిస్తున్న భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణయ్య బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. బాబాసింగ్, పింకీసింగ్ దంపతులు ఇస్నాపూర్‌లో నివాసముంటున్నారు. పింకీసింగ్ గతంలో చిట్టీల వ్యాపారం చేస్తూ నష్టాలను చవిచూసింది. ఆమె భర్త బాబా సింగ్ పాషమైలారంలో ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
కాగా.. నష్టాలను పూడ్చేందుకు వీరు గంజార ుు వ్యాపారాన్ని మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని బేగం బజార్ నుంచి గంజాయిని తెచ్చి ఇంటిముందు ఉన్న ఓ చిన్న తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తున్న మిషతో వీటిని విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. స్థానిక తహశీల్దార్ మహిపాల్‌రెడ్డితో కలిసి దాడి చేసి 2.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరు గ్రాముల బరువుతో ఉన్న 270 ప్యాకెట్లు వీరి వద్ద లభించినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేస్తినట్లు సీఐ వివరించారు.