నగరంలో భారీ వర్షం

Heavy Rain In Hyderabad - Sakshi

నగరంలో భారీ వర్షం

చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు
 

సాక్షి​, హైదరాబాద్‌: భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరం అతలాకుతలం అయ్యింది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్ల మీద మోకాలు లోతులో నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గత అర్థరాత్రి భారీ వర్షం పాతం నమోదైంది. అంబర్‌పేట్‌లో 48 మి.మీటర్లు, నారాయణగూడ 31.8, నాంపల్లి 27.8,  ఎల్బీ నగర్‌ 22.5, జాబ్లీహిల్స్‌ 16 మి. మీటర్ల వర్షంపాతం నమోదైయింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top