మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా.. | Harish Rao Running A Battery Car On Mini Tankbund | Sakshi
Sakshi News home page

మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..

Nov 18 2019 8:17 AM | Updated on Nov 18 2019 8:22 AM

Harish Rao Running A Battery Car On Mini Tankbund - Sakshi

మినీ ట్యాంక్‌ బండ్‌పై బ్యాటరీ కారును నడుపుతున్న మంత్రులు

సాక్షి, సిద్దిపేట: పట్టణంలో పర్యటించిన మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌ రెడ్డిలు ఆదివారం రాత్రి మినీ ట్యాంక్‌బండ్‌ కోమటి చెరువు వద్ద సరదాగా కాలక్షేపం చేశారు. ముందుగా రాక్‌ గార్డెన్, మ్యూజికల్‌ ఫౌంటైన్‌ను మంత్రి నిరంజన్‌ రెడ్డి సందర్శించారు. అనంతరం కోమటి చెరువు కట్టపైన బ్యాటరీ బైక్‌లో మంత్రి హరీశ్‌తో కలిసి విహరించారు. అదేవిధంగా చెరువులో మంత్రులు బోటింగ్‌ చేశారు. చెరువుకట్టపైన సరదాగా పానీపూరి తిని కొద్దిసేపు మినీట్యాంక్‌బండ్‌ పై సేదతీరారు. హుస్సేన్‌ సాగర్‌ తరహాలో కోమటి చెరువును తీర్చిదిద్దడం పట్ల మంత్రి హరీశ్‌రావును ఆయన అభినందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement