త్వరలో ఉమ్మడి భవన్‌ విభజన కొలిక్కి | Government Agent Venugopalachari about | Sakshi
Sakshi News home page

త్వరలో ఉమ్మడి భవన్‌ విభజన కొలిక్కి

Jun 1 2017 12:59 AM | Updated on Sep 5 2017 12:28 PM

త్వరలో ఉమ్మడి భవన్‌ విభజన కొలిక్కి

త్వరలో ఉమ్మడి భవన్‌ విభజన కొలిక్కి

ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌ విభజన త్వరలో ఒక కొలిక్కి వస్తుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు.

ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి
 
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌ విభజన త్వరలో ఒక కొలిక్కి వస్తుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ భవన్‌ విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వం శాంతియుతంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన్‌కు ఉద్యోగుల కేటాయింపుపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఇక ఢిల్లీలో రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

వేడుకలకు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల భారత రాయబారులు హాజరవుతారని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.2 కోట్లతో 12 కొత్త వాహ నాలను కేటాయించింది. వీటిలో 5 ఇన్నోవా, 5 మారుతి సూయిజ్, 2 బొలెరో వాహనాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామ చంద్రు తేజావత్, భవన్‌ రెసిడెంట్‌ కమిషన్‌ అరవింద్‌ కుమార్‌ ప్రారంభించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement