మీరొచ్చే నాటికే హైదరాబాద్‌ విశ్వనగరం | geetha reddy fired on trs government | Sakshi
Sakshi News home page

మీరొచ్చే నాటికే హైదరాబాద్‌ విశ్వనగరం

Mar 24 2017 2:37 AM | Updated on Mar 18 2019 9:02 PM

మీరొచ్చే నాటికే  హైదరాబాద్‌ విశ్వనగరం - Sakshi

మీరొచ్చే నాటికే హైదరాబాద్‌ విశ్వనగరం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికే హైదరాబాద్‌ విశ్వనగరమన్న విషయాన్ని మరిచిపోతే ఎలా గని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి చురకలంటించారు.

టీఆర్‌ఎస్‌ నేతలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి చురకలు
కాంగ్రెస్‌ హయాంలోనే పరిశ్రమలు, పరిశోధన సంస్థలొచ్చాయ్‌


సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటికే హైదరాబాద్‌ విశ్వనగరమన్న విషయాన్ని మరిచిపోతే ఎలా గని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి చురకలంటించారు. కాంగ్రెస్‌ హయాంలోనే భారీ పరిశ్రమలు, ప్రభుత్వ, పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో కొలువు దీరా యని.. ఓఆర్‌ఆర్, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే.. తదితర మౌలిక వసతులతో అందరికీ అతి ప్రాధాన్య నగరంగా మారిందన్నారు. గురు వారం శాసనసభలో మాట్లాడుతూ.. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ బుక్‌’లోనూ సౌత్‌ ఏషియాలోనే హైదరాబాద్‌ నంబర్‌వన్‌ స్థానం లో నిలిచిందని చెప్పారు.

మేకిన్‌ తెలంగాణ అంటున్న ప్రభుత్వం.. యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను ప్రోత్స హిం చాలని, ఉత్పాదకత పెంచే పరిశ్రమలైతేనే ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు లభిస్తా యన్నారు. కానీ, మూడేళ్లలో రాష్ట్రానికి ఎన్ని తయారీ పరిశ్రమలు వచ్చాయని అడిగితే ప్రభుత్వం వద్ద సరైన సమా ధానం లేదని ఎద్దేవా చేశారు. నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మాన్యు ఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)ను కాంగ్రెస్‌ హయాంలో మంజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం దాని అభివృద్ధిపై శ్రద్ద చూపడం లేదన్నారు. 4 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని, ప్రభుత్వం పట్టించు కోకపోవ డంతో వాటిలో అధిక భాగం ఖాయిలా పడ్డాయని ఆరోపించారు. కొనుగోలు దారుల సకాలంలో సొమ్ము చెల్లించక పలు సంస్థలు ఎన్‌పీఏలుగా మారాయాని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement