కేసీఆర్‌ ఇష్టంతో కేటీఆర్‌ ఎమ్మెల్యే కాలేదు | Future Perfect-Ktr book released | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఇష్టంతో కేటీఆర్‌ ఎమ్మెల్యే కాలేదు

Jul 25 2017 1:41 AM | Updated on Sep 5 2017 4:47 PM

కేసీఆర్‌ ఇష్టంతో కేటీఆర్‌ ఎమ్మెల్యే కాలేదు

కేసీఆర్‌ ఇష్టంతో కేటీఆర్‌ ఎమ్మెల్యే కాలేదు

‘‘రాజకీయ నాయకుల వారసులు ఇప్పుడు వచ్చినంత తేలిగ్గా కేటీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదు. కేసీఆర్‌ ఇష్టంతో ఆయన ఎమ్మెల్యే కాలేదు.

‘ఫ్యూచర్‌ పర్ఫెక్ట్‌–కేటీఆర్‌’ పుస్తకావిష్కరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌  
సాక్షి, హైదరాబాద్‌:
‘‘రాజకీయ నాయకుల వారసులు ఇప్పుడు వచ్చినంత తేలిగ్గా కేటీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదు. కేసీఆర్‌ ఇష్టంతో ఆయన ఎమ్మెల్యే కాలేదు. ఆయనకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని రోజులు కూడా ఉండేవి. అయినా కేటీఆర్‌ కష్టపడి, ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు తప్ప కేసీఆర్‌ ప్రోత్సహించి రప్పించలేదు’’అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుపై తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం రచించిన ‘ఫ్యూచర్‌ పర్‌ఫెక్ట్‌ కేటీఆర్‌’ పుస్తకాన్ని సోమవారం  జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలసి  ఆవిష్కరించారు.

ప్రభాకర్‌ మాట్లాడుతూ కేటీఆర్‌లో తొలుత వీసమెత్తు కూడా రాజ కీయ లక్షణాలు కనిపించలేదని, కానీ 2006 తర్వాత ఆయనలో ఆ లక్షణం కనిపిం చిందని అన్నారు. రామ్మోహన్‌ మాట్లాడుతూ కొందరు తమ వారసుల్ని రాజకీ యా ల్లోకి తీసుకొచ్చి మంత్రులను చేస్తున్నారని, కానీ కేటీఆర్‌ అలా కాదని వ్యాఖ్యా నిం చారు. రాష్ట్రం ప్రగతిబాటలో కొనసాగేందుకు కేటీఆర్‌ చాలా కష్టపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement