నాలుగు స్కూలు బస్సులు సీజ్ | four school bus sease in medak district | Sakshi
Sakshi News home page

నాలుగు స్కూలు బస్సులు సీజ్

Jan 31 2015 11:29 AM | Updated on Sep 2 2017 8:35 PM

మెదక్ జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీఏ అధికారులు నాలుగు స్కూలు బస్సులను శనివారం సీజ్ చేశారు.

మెదక్: మెదక్ జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీఏ అధికారులు నాలుగు స్కూలు బస్సులను శనివారం సీజ్ చేశారు. వాటిని ఫిట్ నెస్ లేని బస్సులుగా గుర్తించినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.

గత ఏడాది జూలైలో మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన తెలిసిందే.  అలాగే ఆ బస్సుకు ఫిట్‌నెస్ ఉందా లేదా అనేది నిర్ధారించడానికి  నిపుణులతో పరీక్షలు కూడా చేయించారు.

అప్పటినుంచి మెదక్ జిల్లాలో స్కూలు బస్సులపై ప్రత్యేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఈ బస్సులను సీజ్ చేశారని అధికారులు అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement