పిడుగుపాటుతో నలుగురి మృతి | four dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో నలుగురి మృతి

May 9 2015 5:09 PM | Updated on Sep 3 2017 1:44 AM

పిడుగుపాటుతో నలుగురు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో శనివారం జరిగింది.

జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా): పిడుగుపాటుతో నలుగురు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. గాంగాపూర్ గ్రామ సమీపంలో పిడుగుపడటంతో అదే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నలుగురు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement