మాజీ స్పీకర్ విగ్రహం ధ్వంసం | Former Speaker statue destroyed | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్ విగ్రహం ధ్వంసం

Apr 2 2015 9:15 AM | Updated on Sep 2 2017 11:45 PM

మాజీ స్పీకర్ విగ్రహం ధ్వంసం

మాజీ స్పీకర్ విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు.

కరీంనగర్(కాటారం): ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆయన కుమారుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే విగ్రహాన్ని ఇంతకు ముందు కూడా ఒకసారి ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి ఘటనలో స్పీకర్ విగ్రహం చేయి కూడా విరిగింది. అయితే ఈ పని ఎవరు  చేశారు అనే విషయం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement