మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి కన్నుమూత | Former MP P. Manik Reddy passed away | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి కన్నుమూత

Aug 20 2018 3:18 AM | Updated on Aug 20 2018 3:18 AM

Former MP P. Manik Reddy passed away - Sakshi

మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

జోగిపేట (అందోల్‌): మెదక్‌ మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పి.మాణిక్‌రెడ్డి(77) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో  కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం డాకూరుకు చెందిన ఆయన   నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.  1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1984లో  మెదక్‌ ఎంపీగా అప్పటి కేంద్రమంత్రి శివశంకర్‌పై గెలుపొందారు.  2013లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.  అం త్యక్రియలు ఆదివారం డాకూరులో నిర్వహించారు.  

సీఎం కేసీఆర్‌ సంతాపం..
మాణిక్‌రెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మంత్రి హరీశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు నివాళులర్పించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement