బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్నిప్రమాదం | Fire Accident Occured In Basara Triple IT In Nirmal | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో అగ్నిప్రమాదం

Published Sun, May 31 2020 8:10 AM | Last Updated on Sun, May 31 2020 12:40 PM

Fire Accident Occured In Basara Triple IT In Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌ : జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకడమిక్‌ బ్లాక్‌ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో క్లాస్‌రూమ్‌లోని ఫర్నీచర్‌, ప్రొజెక్టర్‌, సుమారు 60 నుంచి 70 వరకు చైర్లు, 21 టేబుల్స్‌ పూర్తిగా దగ్థం అయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగతో కమ్మేసింది. కాగా షార్ట్‌ సర్య్కూట్‌పై అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక​సిబ్బందికి సమాచారమందించారు. అధికారుల సమాచారంతో వెంటనే చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement