కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో శుక్రవారం రైతులు ధర్నాకు దిగారు.
వీణవంకలో రైతుల ఆందోళన
Mar 4 2016 1:51 PM | Updated on Jun 4 2019 5:16 PM
వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో శుక్రవారం రైతులు ధర్నాకు దిగారు. వీఎన్‌ఆర్ సీడ్ కంపెనీ సరఫరా చేసిన మొక్కజొన్న విత్తనాలతో మోసం పోయామని ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రతినిధులు విత్తనాలు సరఫరా చేసేటప్పుడు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పారని, కానీ తీరా చూస్తే 5 క్వింటాళ్లే దిగుబడి వచ్చిందని వా పోయారు. కంపెనీ తమకు న్యాయం చేయాలని 150 మంది రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక వ్యవసాయాధికారి హరిత రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement