ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం బిజినేపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు సంజీవరెడ్డి(40) అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
చెన్నూరు: ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం బిజినేపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు సంజీవరెడ్డి(40) అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంజీవరెడ్డి ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేసిన పంట ఎండిపోవడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి ఎక్కువ అవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో బుధవారం ఆత్మహత్య పాల్పడ్డాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.