పరిహారం చెల్లించలేదని..ఆత్మహత్యాయత్నం | farmer suicide attempt in karimnagar | Sakshi
Sakshi News home page

పరిహారం చెల్లించలేదని..ఆత్మహత్యాయత్నం

Aug 21 2015 2:14 PM | Updated on Sep 3 2017 7:52 AM

దేవాదుల కాలువ తవ్వకాల్లో భూమి కోల్పోయిన ఒక రైతు పరిహారం చెల్లించలేదని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కరీంనగర్ : దేవాదుల కాలువ తవ్వకాల్లో భూమి కోల్పోయిన ఒక రైతు పరిహారం చెల్లించలేదని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలి అనే రైతు దేవాదుల ప్రాజెక్టు కోసం తవ్వుతున్న కాలువలో భూమి కోల్పోయాడు. అందుకు పరిహారం చెల్లించకుండా అధికారులు కాలువ తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకునేందుకు విషం తాగే ప్రయత్నం చేశాడు.

అయితే, అక్కడే ఉన్న పోలీసులు తన ప్రయత్నాన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా మేం పరిహారం చెల్లించామని తెలిపారు. అయితే, పరిహారం చెల్లించే నాటికి భూమి మొగిలి పేరుమీద పట్టా కాలేదు. దీంతో ఆ భూమికి చెందిన పాత యజమాని లబ్దిపొందినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement