అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఊపిరి తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా హాలియా మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హాలియా (నల్లగొండ) : అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఊపిరి తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా హాలియా మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని బోయగూడెం గ్రామానికి చెందిన బొల్లిగొర్ల ఆంజనేయులు(32) మూడేళ్లుగా ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. సరిగా దిగుబడి రాకపోవటంతోపాటు ఈ ఏడాది పంట సాగుకు కలిపి రూ.5లక్షల అప్పు మిగిలింది.
దీంతోపాటు రూ.1.50 లక్షల అప్పు చేసి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి బిల్లు కూడా రాలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆంజనేయులు శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి చనిపోయాడు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.