సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ | Facilities should be provided: Collector | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్

Mar 18 2014 3:48 AM | Updated on Mar 21 2019 8:35 PM

సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ - Sakshi

సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావటంతో కలెక్టర్ ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయలంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.
 
 డివిజన్‌ల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి, నామినేషన్లు వేసేందుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు, ఇతర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం, సంబంధిత ఫారాలని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
 
 అలాగే మండల స్థాయిలో స్వీకరించే ఎంపీటీసీ నామినేషన్లకు సైతం ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రవీందర్, జిల్లా రెవెన్యూ అధికారి రాంకిషన్, తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement