హమ్మయ్య.. ఆ రెండూ నెగెటివ్‌

Etela Rajender Says No COVID 19 Virus In Two People - Sakshi

పుణే ల్యాబ్‌ నుంచి సమాచారం..

అనుమానం ఉన్న మరో 21 కేసులూ నెగెటివ్‌.. అవసరమైతే 10 వేల పడకలు

‘ప్రైవేటు’లో ఫీజుల ధరలు నిర్ణయిస్తాం: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల 

మాస్కుల ధరలు పెంచి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ధరలు పెంచి అమ్ముతున్న షాపులను సీజ్‌ చేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చాం. వైరస్‌ అనుమానితులు మాస్కులు వేసుకుంటే సరిపోతుంది. – మంత్రి ఈటల 

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేసిన తర్వాత అనుమానం వచ్చి పుణేకు పంపిన రెండు కోవిడ్‌ వైరస్‌ కేసులు నెగెటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కరోనా బాధితుడికి అపోలో ఆస్పత్రిలో సేవలు చేసిన శానిటరీ వర్కర్‌కు, ఇటీవల ఇటలీ వెళ్లొచ్చిన ఐటీ ఉద్యోగి ఇద్దరికీ వైరస్‌ సోకలేదని గురువారం ప్రకటించారు. ఈ ఇద్దరూ మూడ్రోజుల కింద గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇక్కడ చేసిన పరీక్షల్లో వైరస్‌ లోడ్‌ ఎక్కువగా ఉందని రావడంతో నమూనా లను పుణేకు పంపారు. అక్కడ కూడా బుధ వారం చేసిన పరీక్షల్లో స్పష్టత రాలేదు. గురువారం మరోసారి పరీక్షలు చేసి వైరస్‌ సోకలేదని తేల్చారు. పుణే వైరాలజీ ల్యాబ్‌ ఇచ్చిన వైద్య పరీక్షల నివేదికలను మంత్రి మీడియాకు విడుదల చేశారు.

నాలుగు రోజులుగా చాలా టెన్షన్‌ పడ్డామని, ఆ ఇద్దరికీ వైరస్‌ నెగెటివ్‌ రావ డంతో కాస్త ఊరటగా ఉందని పేర్కొన్నారు. బుధవారం 21 మందికి కోవిడ్‌ పరీక్షలు చేశామని, వాళ్లకు కూడా నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. గురువారం మరో 10 మందికి సంబంధించి కోవిడ్‌ పరీక్షలు చేశామని చెప్పారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని   చర్యలు  తీసుకుంటోందని భరోసానిచ్చారు.ప్రజలెవరూ అతిగా స్పందించాల్సినవ సరం లేదని వ్యాఖ్యానిం చారు. ప్రస్తుతం గాంధీలో చికిత్స తీసుకుంటున్న వైరస్‌ బాధితుడు కోలుకుంటున్నా డని తెలిపారు. అత డితో అతి సన్నిహి తంగా మెలిగిన తల్లి దండ్రులకు, అపోలో వైద్య సిబ్బందికి కూడా వైరస్‌ సోకలే దన్న విషయాన్ని గమనించాలన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తికి దగ్గర్లో ఉన్నంత మాత్రాన ఇది సోక దని చెప్పారు. నెగె టివ్‌ వచ్చినంత మాత్రాన తాము విశ్ర మించబోమన్నారు.

10 వేల పడకలు సిద్ధం..
అన్ని ప్రైవేటు టీచింగ్‌ ఆసుపత్రుల్లో ఐసో లేషన్‌ వార్డులు సిద్ధ మయ్యాయని చెప్పారు. ఆయా ఆసుపత్రుల్లో 10 వేల పడకలు ఉన్నా యన్నారు. అవసరమైతే వాట న్నింటినీ వాడు కునేందుకు సిద్ధంగా ఉన్నా మని, ఎలాంటి భయాందోళనలు పడాల్సిన అవసరంలేదని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారన్నారు. ఒకవేళ అవి నిండినా డబుల్‌ బెడ్రూం ఇళ్లల్లోనూ 80 వేల గదులు అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పిన విషయాన్ని ఈటల ప్రస్తావించారు.

కోవిడ్‌ ప్రభావంతో నగరంలో వెలవెలబోతున్న ఓ షాపింగ్‌ మాల్‌..

ఇక్కడి వాతావరణం అననుకూలం..
అధిక ఉష్ణోగ్రతలు కోవిడ్‌ వైరస్‌కు అనుకూలంగా లేదన్న విషయాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. కోవిడ్‌ వ్యాప్తి, నియంత్రణ తదితర అంశాలపై 200 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని వ్యవహరించొద్దని మెడికల్‌ షాపుల యజమానులకు మంత్రి హెచ్చరించారు. మాస్కుల ధరలు పెంచి అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ధరలు పెంచి అమ్ముతున్న షాపులను సీజ్‌ చేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. అయితే వైరస్‌ అనుమానితులు మాస్కులు వేసుకుంటే సరిపోతుందని, అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొంతమంది దగ్గు వచ్చినా గాంధీకి వస్తున్నారని, టెస్టులు చేయాలని కోరుతున్నారని చెప్పారు.

అవసరమైతే డబ్బులు కూడా ఇస్తామంటున్నారని, డబ్బులు ఇస్తే చేసే టెస్టులు కావని వ్యాఖ్యానించారు. కోవిడ్‌ లక్షణాలు ఉండి, విదేశాలకు వెళ్లి వచ్చిన వారికే టెస్టులు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాపించలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దగ్గు, జలుబు వచ్చిన వాళ్లంతా కోవిడ్‌ అని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ పేరిట ప్రైవేటు హాస్పిటళ్లు కూడా ప్రజలను భయపెట్టొద్దని చెప్పారు. కోవిడ్‌ అనుమానితులకు, పాజిటివ్‌ కేసులకు చికిత్స ఇచ్చే ఆస్పత్రులకు ఈ విషయంపై స్పష్టం చేశామని తెలిపారు. కోవిడ్‌ పేషెంట్ల ట్రీట్‌మెంట్‌ ప్రొసీడర్, ఖర్చును సైతం ప్రభుత్వమే డిసైడ్‌ చేస్తుందని చెప్పారు. సమావేశంలో ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top