అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంటు తీగ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
నిజామాబాద్: అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు పెట్టిన కరెంటు తీగ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం లింగంపల్లికి చెందిన కాల హన్మంతు(35) గ్రామానికి సమీపంలో వరి పొలం ఉంది. గురువారం ఉదయాన్నే తన పొలానికి వెళ్లాడు. పక్కపొలం రైతు పందులు రాకుండా పంటను రక్షించుకునేందుకు కరెంట్ తీగను ఏర్పాటు చేసుకున్నాడు. దానిని దాటుతుండగా ప్రమాదవశాత్తూ కాళ్లకు తాకటంతో హన్మంతు షాక్‌తో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
(లింగంపేట)