ఓట్ల గల్లంతుపై చర్యలు  చేపట్టండి: దత్తాత్రేయ | The Election Commission should focus on polling | Sakshi
Sakshi News home page

ఓట్ల గల్లంతుపై చర్యలు  చేపట్టండి: దత్తాత్రేయ

Mar 3 2019 3:03 AM | Updated on Mar 3 2019 3:03 AM

The Election Commission should focus on polling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓట్ల గల్లంతుపై ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టి సారించాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండా రు దత్తాత్రేయ అన్నా రు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం దత్రాత్తేయ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్క సికింద్రాబాద్‌లోనే 4 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, హైదరాబాద్‌ మొత్తం ఇలాగే జరిగిందని ఆరోపించారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు సరిగా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై కమిషనర్‌ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. విజయ్‌ సంకల్ప దివాస్‌ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement