
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ ఎస్పీగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని నియమించింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అన్నపూర్ణను తీసుకోకూడదని ఈసీ ఆదేశించింది. కొడంగల్‌లోని రేవంత్ నివాసంలో మంగళవారం వేకువజామన పోలీసులు చొరబడి అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.