
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి జూలై ఆఖరు నాటికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి పారుదల (మిషన్ భగీరథ) కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. సోమ వారం అన్ని జిల్లాల మిషన్ భగీరథ ఎస్‌ఈలతో ఆమె సమీక్ష నిర్వహించారు.
నల్లగొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో నీరు సరఫరా జరగని గ్రామాలకు 25న ట్రయల్‌రన్ నిర్వహించాలని సూచించారు. సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 28న ట్రయల్‌రన్ ప్రారంభించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.