పెళ్లయిన మూడు నెలలకే.. | Dowry harassments... | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మూడు నెలలకే..

Aug 1 2014 1:21 AM | Updated on Sep 2 2017 11:10 AM

పెళ్లయిన మూడు నెలలకే..

పెళ్లయిన మూడు నెలలకే..

వరకట్న వేధింపులు తాళలేక మండలంలోని నస్కల్ పంచాయతీ రాంపూర్ గ్రామంలో

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
రామాయంపేటలో ఘటన

రామాయంపేట : వరకట్న వేధింపులు తాళలేక మండలంలోని నస్కల్ పంచాయతీ రాంపూర్ గ్రామంలో ఓ వివాహిత పెళ్లి అయిన మూడునెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌ఐ ప్రవీణ్‌బాబు కథనం మేరకు.. దుబ్బాక మండలం నగరం గ్రామానికి చెందిన అంజాగౌడ్ కుమార్తె భవాని (18)ని రామాయంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రుద్రారం దుర్గారాజ్‌గౌడ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం తేవాలని భర్తలో పాటు అత్త, మామ, బావ, తోడికోడలు వేధింపులకు గురి చేశారు. దీంత ఈ బాధలు భరించలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి తండ్రి అంజాగౌడ్ ఫిర్యాదు మేరకు భవానీ భర్త దుర్గారాజ్‌గౌడ్‌తో పాటు మామ భూమాగౌడ్, అత్త, బావ నాగరాజ్‌గౌడ్, తోడికోడలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా వివాహం అయిన కొద్ది రోజుల త రువాత దుర్గారాజ్ దంపతులు గ్రామంలోనే వేరు కాపురం పెట్టారని గ్రామస్తులు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, అయితే ఏం జరిగిందో తెలియదు గాని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement