దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ | DOST Notification For Degree Admissions | Sakshi
Sakshi News home page

దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

Jul 17 2019 1:40 AM | Updated on Jul 17 2019 1:40 AM

DOST Notification For Degree Admissions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం దోస్త్‌ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిగ్రీ ప్రవేశాల్లో చేరేందుకు బుధవారం నుంచి 21 వరకు దోస్త్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. అలాగే బుధవారం (నేటి) నుంచి ఈనెల 22 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 26వ తేదీన ప్రత్యేక విడత సీట్లు కేటాయిస్తామని.. 26 నుంచి 29 తేదీల్లో కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుందని చెప్పారు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేసి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వని వారితో పాటు గతంలో ఇచ్చినా సీటు దక్కని వాళ్లు కూడా ఈ ప్రత్యేక విడతలో మరోసారి ప్రయత్నం చేయొచ్చని ఆయన వెల్లడించారు. సీటు వచ్చిన కాలేజీల్లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని విద్యార్థులు మళ్లీ రూ.400 చెల్లించి తాజాగా దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. సీటు వచ్చి కాలేజీల్లో చేరిన విద్యార్థులు మెరుగైన సీటు కోసం ప్రయత్నిస్తే మూడో విడత వెబ్‌ ఆప్షన్లనే మళ్లీ సమర్పించాల్సి ఉంటుందని లింబాద్రి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement