టీడీపీతో లాభం లేదు.. మరోసారి పొత్తు వద్దు: డీకే అరుణ

DK Aruna Meeting WIth COngress Leaders At Gandipet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆపార్టీ నేతలతో సమావేశమైయ్యారు. ఆదివారం గండిపేటలోని ఆమె ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశాంలో భట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డితో సహా పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కేవలం కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపిందని అన్నారు. అన్ని జిల్లాల్లో పొత్తు ఉపయోగం ఉండదని తాము ముందు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఆమె వెల్లడించారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తాను లోక్‌సభకు పోటీచేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరుణ తెలిపారు. ఓడిపోవడానికి అనేక కారణాల్లో టీడీపీతో పొత్తు కూడా ప్రధానమన్నారు. టీఆర్‌ఎస్‌ ఒక్కొక్క నేతను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ను ఓడించిందని, పాలమూరులో ఓటమిపై అనేక అనుమనాలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, రాజగోపాల్‌ రెడ్డి, హరిప్రియానాయక్‌, హర్షవర్ధన్‌, జానారెడ్డి, దామోదర, సునీతా లక్ష్మారెడ్డి పొన్నాల తదితరులు హాజరైయ్యారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top