సాక్షి, హైదరాబాద్: నవంబర్ చివరి వారంలో జరిగే ఆలిండియా డీజీపీల సదస్సుకు మధ్యప్రదేశ్ వేదిక కానుంది.ఈసారి ఎజెండాలో దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ సమస్యలు, అంతర్గత భద్ర త, ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వం అందించే ఆధునీకరణ నిధులు తదితర అంశాలను రూపొందించిన ట్టు తెలిసింది. ఈ సదస్సు ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), కేంద్ర హోంశాఖ ఉన్నతాధి కారులు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఈ సదస్సులో పాల్గొంటారు.
సదస్సుకు సంబంధించి రెండ్రోజుల కిందట ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశాలు జరిగాయి. ఈ భేటీకి రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారు లు హాజరయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, మావోయిస్టు కార్యకలాపాలు, ఐసిస్ కార్యకలాపా లు, ఉగ్రవాద నియంత్రణ చర్యలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, గిరిజన యువతకు కల్పిస్తున్న శిక్షణ తదితర అంశాలన్నింటిపై నివేదిక సమర్పిం చారు. పోలీస్ ఆధునీకరణకు సం బంధించి వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించ నున్నట్టు సమాచారం.
Sep 28 2017 3:01 AM | Updated on Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement