పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ | cotton production center of Telangana | Sakshi
Sakshi News home page

పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ

Oct 21 2014 3:26 AM | Updated on Sep 2 2017 3:10 PM

అపారమైన పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.

* సిబ్బంది కొరతను తీర్చడానికి కృషి చేస్తా
* సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన స్పీకర్

పరకాల : అపారమైన పత్తి ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ  రాష్ర్టం అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం, మార్‌‌కఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి బస్తాలను తూకం వేసి మాట్లాడారు. ఈ ప్రాంత నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయన్నారు. పత్తికి క్వింటాల్‌కు రూ.4500, మొక్కజొన్న క్వింటాకు రూ.

1310 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పరకాల మార్కెట్‌కు గత వైభవం తీసుకొచ్చేందుకు ధర్మారెడ్డి, తాను కృషి చేస్తామన్నారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. చిల్లర కాంటాల ద్వారా రైతులు నష్టపోతున్నార ని, గ్రామాల్లో దళారులును, చిల్లర కాంటాలను అరికట్టాలని పరకాల డీఎస్పీ, తహసీల్దార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రాంమోహన్‌రెడ్డి.

సీసీఐ ఇన్‌చార్జి కోటస్వామి, మార్కెటింగ్ ఏడీ సంతోష్, సూపర్‌వైజర్ డి. మధు, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, చిదిరాల దేవేందర్, బండారి కవితకృష్ణ, బూచి సుమలత రఘు, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దగ్గు విజేందర్‌రావు, బొచ్చు వినయ్, రేగూరి విజయపాల్‌రెడ్డి, నిప్పాని సత్యనారాయణ, జంగిలి రాజమౌళి, పెరుమాండ్ల చక్రపాణి, ప్రతాప్‌రెడ్డి, మిరుపాల బాబురావు, నందికొండ జయపాల్‌రెడ్డి, దామెర మొగిలి, నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement